దిల్లీలో రైసినా డైలాగ్-2026 పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ‘సాంకేతికత-సుపరిపాలన’ భవిష్యత్తు అంశాలపై ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేసారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్‌టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాల ద్వారా ప్రజలకు అందుతున్న మెరుగైన పౌరసేవల్ని ప్రస్తావించారు. ఏఐ ఎకోసిస్టమ్స్, డేటా సెంటర్లు, క్లీన్, గ్రీన్ ఎనర్జీ, భవిష్యత్తు తరాల కోసం టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు.

