ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే కేన్ విలియమ్సన్ ను వ్యూహాత్మక సలహాదారుగా తీసుకున్న లక్నో యాజమాన్యం ఈసారి ఆస్ట్రేలియా దిగ్గజానికి పెద్ద బాధ్యతలు అప్పగించనుంది. కోచ్గా సుదీర్ఘ అనుభవం కలిగిన వెటరన్ అయిన టామ్ మూడీని తమ ఫ్రాంచైజీ ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించనుంది లక్నో. అయితే.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
      
