
మరాఠాలకు ఓబీసీ కేటగిరి కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే మంగళవారం తన దీక్ష విరమించారు. తన డిమాండ్లలో అత్యధిక శాతాన్ని నేరవేర్చేందుకు ప్రభుత్వం
ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించిందని ఆయన తెలిపారు. మరాఠాలోని అర్హులైన కున్బీలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు.