రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. “తెలంగాణ రైజింగ్” నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో మొదటి రోజే పలు కీలక ఒప్పందాలకు పునాది పడింది. గూగుల్, యూనిలీవర్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

