రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్ల రోడ్డుపై కారులో వస్తున్న వ్యక్తి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఆరోపించి, బస్సు ఆగగానే వెంటనే డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అయితే, అక్కడి రోడ్డుపై స్థలం చాల తక్కువగా ఉండటంతో, బస్సు పెద్దదై ఉండటం వల్ల సైడ్ ఇవ్వడం సాధ్యంకాలేదని డ్రైవర్ పలుసార్లు చెప్పినప్పటికీ, కారు యజమాని వినకపోవడం గమనార్హం.

