కొన్నాళ్ల క్రితం బావ చనిపోయిన తర్వాత అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో చెడు తిరుగుళ్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని ఆగ్రహంతో తమ్ముడు.. అక్కని చంపి ముక్కలు చేసి మజీత్ పూర్ చెరువులో పడవేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గత నెల 28 నాడు బాటసింగారం కిరణం షాపు నుండి తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో తమ్ముడు పప్పు రామ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే హత్య వ్యవహారం బయటపడింది.

