
విదేశీ విద్యా నిధి పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సుమారుగా 20 మంది విద్యార్థులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించడానికి సుమారుగా రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఇన్‌కంట్యాక్స్ కట్టే వారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకం కింద అప్పట్లో
దరఖాస్తు చేసుకున్నారని వారిని కూడా ఎంపిక చేశారని పలువురు ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.