కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా బస్టాప్‌ల్లో మహిళలు కనిపిస్తే బస్ డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ఇప్పటికే పలువురు ఆరోపిస్తూనే ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో మహిళలు ఆందోళనకు దిగారు. బస్సులను ఆపకపోవడంతో రహదారిపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు పథకంతో తమకు మర్యాద లేకుండా పోతుందని ఆవేదన చెందారు. దయచేసి ఈ ఫ్రీ బస్ స్కీమ్‌ను ఎత్తివేయండని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

