తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో మార్చి 22న చెన్నైలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల సంయుక్త సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ఇప్పుడు ప్రాతినిధ్యం తగ్గించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.

