ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కానలీ, పంజాబ్‌పై అర్ధ సెంచరీ సాధించాడు.

