సాధారణంగా మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేనివారు ఎవరైనా కాల్ చేస్తే.. వారి నంబర్ మాత్రమే మనకు కనబడుతుంది. ఎవరో తెలియకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం ఒక్కొక్కసారి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు టెలికాం విభాగం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి నంబర్ తో పాటు పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై కనిపించనుంది. సిమ్ (SIM) కొనేటప్పుడు యూజర్ ఏ ఐడెంటిటీ ప్రూఫ్స్ సమర్పిస్తాడో అందులో ఉన్న పేరే కనిపించనుంది.

