
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మూడో రోజు 286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో నెగ్గింది. సెంచరీ హీరో రవీంద్ర జడేజా బంతితోనూ మెరిశాడు. 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 7 వికెట్లు సాధించాడు.