తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. 1వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

