తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పడిన గొప్ప వ్యవస్థ అని TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ స్థాపన నుండి ఇప్పటివరకు అనేక చారిత్రాత్మక విజయాలను సాధించామని ఆయన గుర్తుచేశారు. ఇకపై రాష్ట్రంలో ‘మూడు రాజధానుల’ విధానం ఉండదని, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

