వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం రికార్డు స్థాయిలో రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. మే లో మొత్తం రూ.2.01 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ. 5310 కోట్ల ఆదాయంతో 9 స్థానంలో ఉంది. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మే నెలలో రూ. 3803 కోట్ల ఆదాయంతో 12వ స్థానంలో ఉంది.

