
తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ నెలలో రూ.3,354 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇది 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాతి కాలంలో ఏపీలో నమోదైన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం కూడా జీఎస్టీ వసూళ్లలో మంచి ప్రగతిని చూపింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 12శాతం వృద్ధి నమోదు, చేసి మొత్తం రూ.6,983 కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ రూపంలో పొందింది.