తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు సత్తా చాటారు. మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు బరిలో నిలిచారు. టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ను బలపరచగా… సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు ‘మన ప్యానెల్’ను బలపరిచారు.నిర్మాతల సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు, మన ప్యానల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.

