తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, కేసీఆర్ 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

