తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే కేటీఆర్‌తోపాటు ఇతర నాయకులు అందరూ విన్నారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు.

