బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం ఘనంగా దావత్ -ఎ -ఇఫ్తార్ నిర్వహించారు. కెటిఆర్ పాల్గొని మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఏ విధంగా వంచించిందో శాసనసభ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామని చెప్పారు.

