
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య గత కొంతకాలంగా జల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ.. కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు సిఎంలకు వీలు అవుతుందో, లేదో తెలపాలని పేర్కొంది.