తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in, results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 66.20 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో టాప్‌గా నిలిచింది. 58.69 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరలో ఉంది.

