తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 70 రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. భయంతో ప్రజలు అవసరం కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయడం వల్లే స్టాక్ అయిపోయినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టినప్పటికీ, రోజువారీ అమ్మకాల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నట్లు మానిటరింగ్‌లో తెలుస్తోందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

