తెలంగాణను చలి వణికిస్తోంది. ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు,కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 – 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది

