
తెలంగాణలో కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇకపై ‘ఈ-చిప్ ఎనేబుల్డ్’ పాస్‌పోర్టులు జారీ కానున్నాయి. విదేశాంగ శాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్టులను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి జె. స్నేహజా తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టులు ఉపయోగిస్తున్నవారు వాటి చెల్లుబాటు కాలం పూర్తయ్యే వరకు ఉపయోగించవచ్చు. వారి పాస్‌పోర్టు చెల్లుబాటు ముగిసిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే.. వెరిఫికేషన్ తదితర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ-చిప్ పాస్‌పోర్టులను పొందవచ్చు అని RPO స్పష్టం చేశారు.