
తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2025) సీట్ల కేటాయింపు తొలి దశ ప్రక్రియ పూర్తి అయింది. ఫలితాలను ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫేజ్ 1 కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్సైట్ tsecet.nic.inలో ఉంచింది. అభ్యర్థులు జూన్ 29 లోపు అడ్మిషన్ ఫీ చెల్లించాలి. అడ్మిషన్‌ను నిర్ధారించడానికి అభ్యర్థులు ఆన్లైన్ స్వీయ-రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకుంటే కేటాయించిన సీటు రద్దు చేస్తారు.