ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వచ్చి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు.

