తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.