
తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలో తొలిసారిగా AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (ICCC)ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసింది. Rs 30 కోట్ల ఖర్చుతో ఎన్.ఆర్.ఐ.ల దాతృత్వంతో ఈ ఆధునిక సదుపాయాన్ని సిద్ధం చేశారు. భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గించడం, సౌకర్యవంతం, సురక్షితంగా మార్చడానికి, రియల్-టైమ్ రద్దీ అంచనా, ఫేస్ రికగ్నిషన్, 3D మ్యాప్స్, సైబర్ థ్రెట్ మానిటరింగ్ వంటి AI ఫీచర్లతో ఈ సెంటర్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో కీలకంగా సేవలు అందించనుంది.