
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ మాట ప్రకారం.. అన్యమత ఉద్యోగులపై టీటీడీ తొలిసారి చర్యలు ప్రారంభించింది. ఉద్యోగుల వివరాలు చెక్ చేసి బదిలీ పర్వం మొదలుపెట్టింది. టీటీడీలో ఇక అన్యమతస్తులు కనిపించరని స్పష్టమవుతోంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అన్షుతాను నరసింగాపురం ఫార్మసీకి బదిలీ చేశారు. అన్షుతా అన్యమతస్తురాలు అని.. ఆమె పూజకు రాదు అని…ఆరోపణలు ఉన్నాయి.