
తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు అలవాటుగా మారిందని వైసీపీ ఆరోపించింది.. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయ వేదికగా మార్చడం అనైతికమని పార్టీ విమర్శలు గుప్పించింది. తిరుమల వంటి జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన పవిత్రక్షేత్రాన్ని రాజకీయ దాడులకు వేదిక చేయడం ఆమోదయోగ్యం కాదని, 2023లో తిరుమల పరకామణి ఘటనలో చోరీకి పాల్పడిన రవికుమార్‌ను పోలీసులు పట్టుకున్నారని ఈ సంఘటనలోనూ చంద్రబాబు, లోకేష్‌లు రాజకీయ లాభం దక్కించుకోవాలని ప్రయత్నించడం సరికాదని వైసీపీ ట్విట్టర్లో పేర్కొంది.