తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో దాదాపు 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తీరప్రాంత జిల్లాలైన విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం, తిరువళ్లూరు, తంజావూరు, పుదుక్కోట్టై, రామనాథపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలకు సెలవులు ప్రకటించారు.

