అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందన్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతదని హెచ్చరించారు. ములుగులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు రూ.11,650కు ఫోన్లు కొంటే.. రూ.14వేలు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం పునర్నిర్మాణం పనుల్లో అవినీతికి తావులేదన్న సీతక్క.. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. అవసరమైతే సీబీఐ విచారణ జరపాలన్నారు.

