
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. “వైకాపా నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కొనసాగిస్తున్నారు. బెదిరింపులు, హింసతో ప్రజల్లో భయం సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము భయపడేది లేదు. ప్రజలకు భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. చట్టబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైతే కఠినంగా స్పందిస్తాం. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాం,” అని పవన్ స్పష్టం చేశారు.