దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీని టార్గెట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ భవనంతో పాటు ఢిల్లీ మెట్రోలోని విధాన సభ స్టేషన్లను పేల్చివేస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూలను సైతం బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, మెట్రో స్టేషన్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.

