ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనపై తన గాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా జీతో పాటు ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించాను,” అని పేర్కొన్నారు.

