దేశ రాజధాని ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధానిలో పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్లో రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, నాకాబందీ ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సజ్జనార్ కోరారు.

