
ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ప్రధాని అధ్యక్షతన మరికాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకుని, భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.