దేశ రాజధాని ఢిల్లీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హనుమాన్ మూర్తి చౌక్ వద్ద జరిగింది.25 మంది ప్రయాణికులతో జైపూర్ నుంచి వస్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. అర్ధరాత్రి దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బాధితుల్ని రక్షించే చర్యలు చేపట్టారు.

