
2022లో కాకినాడలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం శవాన్ని అతని ఇంటి వద్ద “డోర్ డెలివరీ” చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ కేసు పునర్విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ద్వారా తదుపరి విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. ఈ విచారణలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విచారణలోని లోపాలను సరిదిద్ది, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.