
18 రోజులు పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా నలుగురు భూమికి తిరుగు పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రూ కాప్సూల్ విడిపోయింది. అనంతరం భూమి దిశగా పయనం ప్రారంభించింది. 22 గంటల ప్రయాణం అనంతరం ఈ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం (జూలై 15) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా తీరంలో దిగనుంది.