
పోరాటాల తెలంగాణ గడ్డను డ్రగ్స్‌కి అడ్డాగా మారడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో పోరాటల స్పూర్తితో ముందుకు పోవాల్సిన రాష్ట్రం డ్రగ్స్, గంజాయి బారినపడటం చాలా బాధకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో గంజాయి, డ్రగ్స్ ఏ స్కూల్, కాలేజీలో పట్టుబడిన ఆ యాజమాన్యంపై కేసు బుక్ చేసి సీజ్ చేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా సీఎం తెలిపారు. ఈసందర్భంగా లోగోని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.