యూఎస్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ డెల్ టెక్నాలజీస్ ఈ ఏడాది కూడా తన ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో దాదాపు 11,000 మందిని నిశ్శబ్దంగా తగ్గించుకుంది.కంపెనీ దాఖలు చేసిన 10-కే ఫైలింగ్‌లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తగ్గించినట్టు వెల్లడించింది.ఉద్యోగుల తెగదెంపుల ప్యాకేజీ కోసం 569 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తన ఫైలింగ్‌లో పేర్కొన్నది.

