తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన, ఊహించని అధ్యాయం మొదలైంది. దివంగత జయలలితకు నమ్మిన బంటుగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తన మద్దతుదారులతో కలిసి వచ్చిన ఓపీఎస్‌కు స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.

