
దళిత ప్రభుత్వ అధికారి డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకున్నాడు. ఆమెను బతిమాలడంతోపాటు క్షమాపణ కోరాడు. విల్లుపురం జిల్లా తిండివనం మున్సిపాలిటీలో దళిత ప్రభుత్వ ఉద్యోగి మునియప్పన్‌ను ఒక పత్రం కోసం కౌన్సిలర్ రమ్య, ఆమె భర్త రాజా డిమాండ్ చేశారు. ఆలస్యం చేయడంతో తనను కులం పేరుతో దూషించినట్లు ఆయన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కొందరు అధికారుల బలవంతంతో కౌన్సిలర్ రమ్య కాళ్లపై పడి క్షమాపణ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.