ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలనీ కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

