ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది.

