
Rapido వినియోగదారులకు షాక్ ఇచ్చింది. Rapido కొత్త ఛార్జింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు మీ రైడ్ సమయంలో భారీ ట్రాఫిక్ ఉండి ప్రయాణం ఆలస్యం అయితే, దాని ఖర్చును కూడా మీరే భరించాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఆలస్యం అయితే నిమిషానికి రూ.0.50 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. దీని గరిష్ట పరిమితి రూ.30గా నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల మహా నగరాల్లో రాపిడోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.