అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. సెన్సెక్స్ 2,700 పాయింట్లకి పైగా, నిఫ్టీ 800 పాయింట్లకి పైగా లాభపడ్డాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 77,315 స్థాయి వద్ద, నిఫ్టీ 23,915 వద్ద కదలాడుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది.

