
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అప్పుడు అలా జరిగుండాల్సింది కాదని ఆయన వ్యాక్యానించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌లో శాంతి నెలకునేందుకు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు తన బృందం సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే కీవ్ అధినేత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.